సిరిచేల్మా ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ..

ఇచ్చోడ, ఆంధ్రప్రభ: ఇచ్చోడ మండలంలోని ప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రం సిరిచేల్మా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శంకుస్థాపన చేశారు.

రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు ముందు ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు విజయవంతంగా పూర్తికావాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిరిచేల్మా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఆ నిధులను వీలైనంత త్వరగా మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని అన్నారు.

ఆలయానికి భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, ఇచ్చోడ ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పాండు, గడిగే సుభాష్, మల్లేష్, రషీద్, నజీర్, నర్వడే రమేష్, కరీం, సురేందర్ గౌడ్, విజేందర్, అలీం, బాపురావు, సూర్యకాంత్, నరేష్, సచిన్, రాంచందర్, పొచ్చన్నతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply