TG | రాష్ట్ర అవతరణ వేడుకలకు అతిథులు వీరే…

TG | రాష్ట్ర అవతరణ వేడుకలకు అతిథులు వీరే…
పెద్దపల్లి, (ఆంధ్రప్రభ): తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జిల్లాల వారీగా జాతీయ జెండాను ఆవిష్కరించే ముఖ్య అతిథుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని వివిధ జిల్లాలకు ప్రముఖ ప్రజాప్రతినిధులను, మంత్రులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పెద్దపల్లి జిల్లాకు ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు..
కరీంనగర్ జిల్లాకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్..
రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జగిత్యాల జిల్లాకు మంత్రి అజారుద్దీన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జూన్ 2వ తేదీన ఉదయం 8:00 గంటలకు ఆయా జిల్లా కేంద్రాల్లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్య అతిథులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో పేర్కొంది.
