2000 ships | మరో రెండు రోజుల్లో గుజరాత్ పోర్ట్ కు రాక

2000 ships | మరో రెండు రోజుల్లో గుజరాత్ పోర్ట్ కు రాక
2000 ships | అమెరికా-ఇరాన్ మధ్య చర్చలతో క్రమంగా తగ్గుతున్న ఉద్రిక్తతలు
నెలల తరబడి నిలిచిపోయిన రాకపోకలు నెమ్మదిగా పునరుద్ధరణ
భారత్ ఇంధన నిల్వలకు, ముఖ్యంగా ఎల్పీజీ సరఫరాకు ఊరట
2000 ships | న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత్‌కు వస్తున్న ఓ చమురు ట్యాంకర్ కీలకమైన హర్మూజ్ జలసంధిని శుక్రవారం (29న) సురక్షితంగా దాటింది. ఈ నౌక మరో రెండు రోజుల్లో గుజరాత్ తీరానికి చేరనుంది. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు ఊపందుకోవడంతో ఈ కీలక సముద్ర మార్గంలో నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయనడానికి ఈ పరిణామం ఓ సంకేతంగా నిలుస్తోంది. ప్రాంతీయ ఘర్షణల కారణంగా కొన్ని నెలలుగా ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దీంతో పర్షియన్ గల్ఫ్‌లో దాదాపు 2,000 నౌకలు నిలిచిపోయాయి. ప్రపంచంలోని ఐదో వంతు చమురు, గ్యాస్ రవాణా జరిగే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ, నౌకలపై దాడులతో ఫిబ్రవరినుంచి ఇక్కడ సంక్షోభం కొనసాగుతోంది. మొత్తం అవసరాల్లో 85 శాతానికి పైగా చమురును దిగుమతి చేసుకునే భారత్‌పై ఈ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపింది. అయితే, ఇటీవలి వారాల్లో ‘సర్వ శక్తి’ సహా మరికొన్ని భారత ట్యాంకర్లు ఈ మార్గాన్ని విజయవంతంగా దాటాయి.
తాజా పరిణామంతో దేశీయ ఇంధన నిల్వలకు, ముఖ్యంగా వేసవిలో గృహ వినియోగానికి అవసరమైన ఎల్పీజీ సరఫరాకు మరింత ఊరట లభించనుంది. ప్రస్తుతం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు పురోగతిలో ఉన్నాయని, మరో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపునకు ఇరు దేశాలు దగ్గరగా ఉన్నాయని సమాచారం. ఈ మార్గం పూర్తిగా తెరుచుకుంటే ప్రపంచ చమురు ధరలు స్థిరపడతాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఇటీవల పేర్కొన్నారు.
CLICK HERE TO READ Kozhikode | రూ.34 కోట్ల ‘బ్లడ్ మనీ’తో స్వదేశానికి రాక..
