హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్‌గా ఆరూరి సాంబయ్య..

కాజీపేట, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్‌గా కాజీపేటకు చెందిన ఆరూరి సాంబయ్యను నియమించారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర దళిత విభాగ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ స్థాయి దళిత విభాగ నాయకులు ఆరూరి సాంబయ్యను ఢిల్లీకి తీసుకెళ్లగా, జాతీయ దళిత విభాగ అధ్యక్షుడు రాజేంద్ర పాల్ గౌతమ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆరూరి సాంబయ్య మాట్లాడుతూ, దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఈ నియామకం జరగడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర దళిత విభాగ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ ఎస్సీ సెల్ కో-ఆర్డినేటర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, భత్తిని శ్రీనివాస్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply