Congress | ఏపీ రాజకీయాలపై చర్చ

Congress | ఏపీ రాజకీయాలపై చర్చ
ఏపీలో కాంగ్రెస్ కు పూర్వం వైభవం..
రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల చర్చలు
ఢిల్లీలోని 10 జనపథ్‌లో ఏపీసీసీ అధ్యక్షురాలి భేటీ
పార్టీ విస్తరణ, ప్రజా ఉద్యమాలపై కీలక సూచనలు
రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమీక్ష
Congress | ( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. సమావేశం సుమారు అరగంటకు పైగా కొనసాగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పోరువవైభవం తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ చర్యలు ముమ్మరం చేసింది.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి శుక్రవారం ఢిల్లీలోని 10 జనపథ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీ సంస్థాగత విస్తరణ, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పలు అంశాలపై రాహుల్ గాంధీ సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు నిర్వహించాలని, యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగ వర్గాలను పార్టీకి చేరువ చేసే కార్యాచరణను వేగవంతం చేయాలని సూచించినట్లు తెలిసింది. అలాగే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఏర్పడుతున్న స్పందనపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని రాహుల్ గాంధీ సూచించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
