ధాన్యం తరలింపు వేగవంతం చేయాలి

ధాన్యం తరలింపు వేగవంతం చేయాలి
- తహసీల్దార్ యాదవరావు
దస్తూరాబాద్, ఆంధ్రప్రభ న్యూస్: ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని తహసీల్దార్ యాదవరావు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. గురువారం సెలవు రోజు అయినప్పటికీ మండలంలోని పలు వరి కొనుగోలు కేంద్రాలను ఆయన హుటాహుటిన పరిశీలించారు.
దేవునిగూడెం, రాంపూర్, దస్తూరాబాద్, పెర్కపల్లె, మున్యాల, రేవోజిపేట, చెన్నూర్, బుట్టాపూర్ కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
లారీల కొరత కారణంగా ధాన్యం తరలింపులో ఆలస్యం జరుగుతోందని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలుసుకున్న తహసీల్దార్ వారికి భరోసా ఇచ్చారు. కలెక్టర్‌తో మాట్లాడి లారీలు వచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు అండగా ఉండాలని, ధాన్యం తరలింపులో సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు అంశాన్ని పట్టించుకోవడం లేదని రైతులు తహసీల్దార్ యాదవరావు దృష్టికి తీసుకెళ్లారు.
