పోలీస్ సిబ్బందికి హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ కార్యక్రమం….!

సత్తెనపల్లిలో పోలీస్ అధికారులు, సిబ్బందికి….
హాజరైన 100 మంది పోలీసు సిబ్బంది..
పల్నాడు ప్రతినిధి, మే 25 (ఆంధ్రప్రభ) : పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని వావిలాల గోపాలకృష్ణయ్య పార్క్ లో సోమవారం “రామచంద్ర మిషన్” వారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి పోలీస్ సబ్- డివిజన్ అధికారులు, సిబ్బందికి హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు ఉంటుందని తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డిఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు పర్యవేక్షణలో యోగా కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి రామచంద్ర మిషన్ నుండి యోగా గురువు సుజాత హాజరయ్యారు. సత్తెనపల్లి పోలీస్ సబ్- డివిజన్ నుండి 100 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇది పోలీసు సిబ్బంది, అధికారులలో ఉన్న ఒత్తిడిని తగ్గించడం కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డి.ఎస్.పి మేదరమెట్ల హనుమంతురావు చెప్పారు.

