Miss Venezuela 2025 Attack : : అందాల రాశిపై దాడి Andhra Prabha Top News

Miss Venezuela 2025 Attack :: అందాల రాశిపై దాడి Andhra Prabha Top News

  • కేన్స్‌ ఫెస్టివల్‌లో షాకింగ్‌
  • ఆండ్రియాపై కత్తెరతో దాడి
  • రక్తసిక్త ముఖంతో వీడియో విడుదల
  • స్టైలిస్ట్‌ గియోవన్నీ లగునా అరెస్ట్‌
  • హోటల్‌ గదిలో వాగ్వాదం.. హింసాత్మక దాడి
  • ఫ్రాన్స్‌ పోలీసుల దర్యాప్తు కొనసాగింపు
  • గ్లామర్‌ ప్రపంచంలో తీవ్ర సంచలనం
  • సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

( ఆంధ్రప్రభ; కేన్స్​ ప్రతినిధి)

Miss Venezuela 2025 Attack

ప్రపంచ సినీ తారల సంబరంలో అపశృతి చోటు చేసుకుంది. గ్లోబల్​ అందాల రాశిపై స్టయిలిష్​ దాడి చేశాడు. కత్తెరతో ఆమె ముఖంపై పొడిచాడు. ఈ రాక్షస ఘటన ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలే రక్తసిక్త ముఖంతో వీడియోను విడుదల చేసింది. ఈ సమాచారంతో అందాల లోకం నివ్వెర పోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026) వేదికగా ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అందాల రాశి, మిస్ వెనిజులా గ్లోబల్ 2025 ఆండ్రియా డెల్ వాల్ తన సెలబ్రిటీ స్టైలిస్ట్ గియోవన్నీ లగునా తనపై హోటల్ గదిలో ఘోరంగా దాడి చేశాడని ఆరోపించారు.

Miss Venezuela 2025 Attack : : అసలేం జరిగింది?

Miss Venezuela 2025 Attack

ఆండ్రియా డెల్ వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక భయంకర వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె ముఖం అంతా రక్తంతో నిండిపోయి, తీవ్రమైన గాయాలతో కనిపించారు. కేన్స్‌లోని ఒక లగ్జరీ హోటల్ గదిలో ఒక ప్రాజెక్ట్ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలో స్టైలిస్ట్ గియోవన్నీ లగునా కత్తెరతో ఆమె ముఖంపై దాడి చేశాడని నివేదికలు పేర్కొంటున్నాయి. సదరు దాడి జరిగిన తర్వాత ఆ హోటల్ గది మొత్తం అస్తవ్యస్తంగా, వస్తువులన్నీ కిందపడి ధ్వంసమై ఉన్నట్లు సమాచారం. వీడియోలో మిస్ వెనిజులా వ్యాఖ్యలుఆండ్రియా తన వీడియోలో స్టైలిస్ట్‌ను ఉద్దేశిస్తూ.. “కంగ్రాచ్యులేషన్స్ గియోవన్నీ, నువ్వు ఎలాంటి వాడివో లోకానికి నిరూపించుకోవాలని నేను అనుకున్నాను, సరిగ్గా అదే చేశావు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘోర ఘటన సమాచారంతో ఫ్రాన్స్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సెలబ్రిటీ స్టైలిస్ట్ గియోవన్నీ లగునాను రోడ్డుపైనే అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం, గియోవన్నీ లగునా తరఫున కొందరు సాక్షులు ఆయనకు మద్దతుగా స్టేట్‌మెంట్ ఇవ్వడంతో, ఫ్రెంచ్ పోలీసులు అతడిని బెయిల్‌పై విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియా ఛానెళ్లు చెబుతున్నాయి. ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ ఇంకా కొనసాగుతోంది.గ్లామర్‌ ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కేన్స్ ఫెస్టివల్ వేళ ఒక అంతర్జాతీయ మోడల్‌పై ఇలాంటి హింసాత్మక దాడి జరగడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాషన్ పరిశ్రమలో తీవ్ర సంచలనంగా మారింది.

Miss Venezuela 2025 Attack :: ఆండ్రియా ఆరోపణ ఇది

Miss Venezuela 2025 Attack

మిస్ వెనిజులా 2025 ఆండ్రియా డెల్ వాల్, తన స్టైలిస్ట్, గియోవన్నీ లగునా, మంగళవారం దక్షిణ ఫ్రాన్స్‌లోని ప్రముఖ రిసార్ట్‌లో తనపై శారీరకంగా దాడి చేశాడని వెనుజులా అందాల రాశి ఆరోపించారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ, “చూడండి, గియోవన్నీ లగునా చేసింది ఇదే. అభినందనలు, గియోవన్నీ, నువ్వు ఎలాంటివాడివో చూపించాలని నేను కోరుకున్నది ఇదే,” అని డెల్ వాల్ అన్నారు.

ALSO READ : Trump Shock : టెకీలకు ట్రంప్​ షాక్​ Andhra Prabha

Leave a Reply