బాసర క్షేత్రం భక్తులతో కిటకిట

బాసర క్షేత్రం భక్తులతో కిటకిట
బాసర (నిర్మల్ జిల్లా),ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని భక్తులతో కిటకిట లాడింది. వేసవి సెలవు శుక్రవారం వేల సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాలి. భక్తులు గోదావరి పుణ్యా స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. ఉదయం నుండి మ అమ్మవారి దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టడంతోభక్తులు తీవ్ర అవస్తులు పడ్డారు. ఆలయ పరిసరాలలో త్రాగునీరు అందుబాటులో లేకపోవడంతో భక్తులు అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తులకు కనీసం క్యూలైన్లో త్రాగునీరు లేకపోవడంతో చిన్నారులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

