రాగి తీగల చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్….

సత్తెనపల్లి, ఆంధ్రప్రభ : సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పరిధిలో రైతుల పొలాల్లో రాగి తీగలు దొంగిలించిన కేసులో ముగ్గురిని గ్రామీణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ముప్పాళ్ల మండలం రుద్రవరానికి చెందిన ఇద్దరు, క్రోసూరు మండలం పీసపాడుకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పలువురు రైతుల ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుమారు రూ.10 వేల విలువైన రాగి తీగలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు

Leave a Reply