చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి..

నర్సంపేట, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ డా. వేములపల్లి సుబ్బారావు సూచించారు. క్రీడాకారులుగా ఎదగాలంటే చదువు కూడా ముఖ్యమని, దాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు దెబ్బతింటుందని అన్నారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడా వారోత్సవాల్లో భాగంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని శివాని పబ్లిక్ స్కూల్, మహేశ్వరంలో శుక్రవారం కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించారు.

ఈ పోటీలకు వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, ఎస్సార్ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ డా. పుల్లూరి శ్రీనివాస్ గౌడ్, గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డా. వేములపల్లి సుబ్బారావు, శివాని పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గిరిగాని రాహుల్ వర్మ హాజరై పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా డా. పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాలు క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని అన్నారు. వరంగల్ జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందని, క్రీడారంగ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

డా. వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ ప్రణాళిక అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ పోటీల్లో స్టేడియం నర్సంపేట, శివాని పబ్లిక్ స్కూల్, మేడపల్లి, అశోక్‌నగర్ గ్రామాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రథమ బహుమతిని శివాని పబ్లిక్ స్కూల్ జట్టు కైవసం చేసుకోగా, ద్వితీయ బహుమతిని స్టేడియం నర్సంపేట జట్టు గెలుచుకుంది.

ఈ కార్యక్రమంలో నర్సంపేట స్టేడియం ఇన్‌చార్జి, కబడ్డీ కోచ్ యాట రవికుమార్ ముదిరాజ్, వరంగల్ జిల్లా ప్రైవేట్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ఉరుసుల శేఖర్ యాదవ్, వజ్జ రాజేష్, ఓరుగంటి మహేష్, పుల్లూరి సుమన్ గౌడ్, కుంట విజేందర్ యాదవ్, శివాని పబ్లిక్ స్కూల్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply