మల్లికార్జున స్వామి దేవాలయానికి భారీ విరాళం..

మల్లికార్జున స్వామి దేవాలయానికి భారీ విరాళం..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ పునర్ నిర్మాణంలో భాగంగా ఆకుల పాండురంగం 35 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందని శివారెడ్డిపేట వీరశైవ సమాజం నాయకులు ఆర్ఎం ఆనందం, కే శివరాజ్ తెలిపారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని.. కుటుంబ సభ్యులకు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఆలయ పునర్ నిర్మాణం కోసం సహకరిస్తున్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేసారు.
