హద్దు మీరితే చర్యలు తప్పవు..

హద్దు మీరితే చర్యలు తప్పవు..
- సీఐ నాగమల్లేశ్వరరావు..
సత్తెనపల్లి టౌన్, ఆంధ్రప్రభ:
ప్రమాదాల నివారణకు తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని, హద్దు మీరితే చర్యలు తప్పవని సత్తెనపల్లి పట్టణ సిఐ నాగమల్లేశ్వరరావు అన్నారు. గురువారం తోపుడుబండ్ల చిరు వ్యాపారుదారులకు సమావేశం నిర్వహించారు. రహదారిపై పండ్ల వ్యాపారస్తులు వారి తోపుడు బండ్లను రహదారిని ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని, దీనితో కొనుగోలుదారుడు వారి ద్విచక్ర వాహనాలను నడిరోడ్డుపై ఆపి కొనుగోలు చేస్తూ ఉంటారని ఈ కారణంగా రహదారిపై వచ్చి పోయే భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పాటు, ప్రజలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఎంతైనా ఉందని సిఐ నాగ మల్లేశ్వర సూచించారు.
రహదారిపై సైడ్ మార్జిన్ గీతను దాటి తోపుడు బండ్లను ఉంచిన వారిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు మైకుల్ని పెట్టి పెద్ద సౌండ్ లతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని దానివలన రహదారిపై రాకపోకలు సాగిస్తున్న పాదచారులకు వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందికరంగా మరిందన్నారు. లౌడ్ స్పీకర్లను ఉపయోగించే వారిపైన, రహదారి పైన నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపై వ్యాపారం చేసుకునేవారు బాధ్యతగా వ్యవహరించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.
హద్దు మీరితే చర్యలు తప్పవు..
