ఉద్యోగులకు సేవకుడిగా పనిచేస్తా

ఉద్యోగులకు సేవకుడిగా పనిచేస్తా

  • నూతన సెక్రెటరీ కుంట శ్రీనివాస్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ:
తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీఎన్జీవోఎస్) నిజామాబాద్ జిల్లా ఆఫీస్ సెక్రటరీగా భీమ్‌గల్ ఐకేపీ సీసీ కుంట శ్రీనివాస్‌ను గురువారం జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ నియమించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు భీమ్‌గల్ ఏరియా టీఎన్జీవోఎస్ అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న కుంట శ్రీనివాస్ సేవలను గుర్తించి, పదోన్నతిపై జిల్లా కార్యవర్గంలోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. భీమ్‌గల్ ఐకేపీ ఆఫీస్ సీసీగా పనిచేస్తున్న కుంట శ్రీనివాస్‌కు జిల్లా ఆఫీస్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించడం పట్ల స్థానిక ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన జిల్లా సెక్రటరీ కుంట శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులకు ఒక సేవకుడిగా అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అంకితభావంతో కృషి చేస్తానని స్పష్టం చేశారు.

తన నియామకానికి పూర్తి స్థాయిలో సహకరించిన టీఎన్జీవో జిల్లా కార్యదర్శి శేఖర్, కేంద్ర సంఘం బాధ్యులు పోలా శ్రీనివాస్, జాఫర్ హుస్సేన్, ఎలక్షన్ అధికారి వనమాల సుధాకర్, వివిధ యూనిట్ల అధ్యక్షులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఐకేపీ జేఏసీ అధ్యక్షులు మాణిక్యం, సీసీల యూనియన్ అధ్యక్షులు తడకల శ్రీనివాస్, డీపీఎం, ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్ సీసీలు, ఐకేపీ వీఓఏలు గ్రామ సంఘాల సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply