సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం

సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
మోత్కూరు, ఆంధ్రప్రభ: జనగణనలో కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు పట్ల బీసీ రిజర్వేషన్ సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. గురువారం మున్సిపల్ కేంద్రంలోని స్థానిక శ్రీకాంతాచారి చౌరస్తా వద్ద బీసీ నాయకులతో ఆ సమితి నాయకులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షులు శివార్ల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన కులాలు విద్య, ఉద్యోగ ,ఆర్థిక సామాజిక అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఈ లెక్కలు అవసరమన్నారు. ఏ కులం ఏ రంగంలో వెనుకబడి ఉందో ఆ కులాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకునే నిర్ణయాలకు కులాల లెక్కలు అవసరమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నోముల రమేష్ నేత, పట్టణ అధ్యక్షులు నిలిగోండ మత్స్యగిరి, గ్రంథాలయ చైర్మెన్ కోమటి మత్స్యగిరి, స్థానిక నాయకులు బయ్యని రాజు, చిలకమర్రి బాబుచారి, నల్ల నాగయ్య, మర్రి ఆనందం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
