25 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

జిల్లాలో 43 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
పరీక్షలను పటిష్ట ఏర్పాట్లతో సమర్ధవంతంగా నిర్వహించాలి…
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి.

ఏలూరు బ్యూరో, మే 21, ఆంధ్రప్రభ : ఈ నెల 25 వతేదీ నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్ సి మరియు ఇంటర్మీడియట్‌ (ఏ.పి.ఓ.ఎస్.ఎస్)అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఎస్ఎస్ సి, ఇంటర్మీడియట్ (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణపై గురువారం సంబంధిత జిల్లా అధికారులతో జిల్లా కలెక్టరు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 43 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో పదవ తరగతి పరీక్షలకు 30 పరీక్ష కేంద్రాలు, ఎస్ ఏస్ సి (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) పరీక్షలకు 11, ఇంటర్మీడియట్ (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) కు 02 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పదవ తరగతి పరీక్షలకు 5,226 మంది, ఎస్ఎస్ సి (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) పరీక్షలకు 479 మంది, ఇంటర్మీడియట్ (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) కు 364 మంది పరీక్షలకు హాజరు అవుతున్నారని పేర్కొన్నారు. మే 25వ తేదీ నుంచి జూన్ 4 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటలు వరకు పరీక్షలు జరుగుతాని తెలిపారు. పరీక్ష గదుల్లోకి ఇన్విజిలేటర్లు, సిబ్బంది, విద్యార్థులు ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఇతర ఎలక్ర్టానిక్‌ వస్తువులు తీసుకు రాకూడదన్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. పరీక్షలు నిర్వహణకు 21 స్టోరేజీ పాయింట్లను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలు నిర్వహణకు 40 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 40 మంది డిపార్ట్ మెంటల్ అధికారులను, 7 ఫ్లైయింగు స్వాడ్లను, 5 గురు రూటు ఆఫీసర్లను,5 గురు సహాయ రూటు ఆఫీసర్లను, 260 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని అన్నారు. ఆయా మండలాల్లోని పరీక్షా కేంద్రాలు పరిధిలో సెక్షన్ 144 అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత తహశీల్దార్లను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జీరాక్స్ కేంద్రాలను, ఇంటర్ నెట్ సెంటర్లను మూసివేసేలా సంబంధిత తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్ష సమయంలో ఎటువంటి విద్యుత్తు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ ఎస్ఇని జిల్లా కలెక్టరు ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లను, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని జిల్లా కలెక్టరు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఫర్నిచరు, చల్లటి త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకు ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మున్సిపల్ కమీషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా సమయానికి అనుగుణంగా గ్రామీణ విద్యార్థులు సంబంధిత పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరేలా బస్సు సర్వీసులు సమయాన్ని రీషెడ్యూల్ చెయ్యాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, పరీక్షలు నిర్వహణ సహాయ కమీషనరు ఆర్.ఆశ, సంబంధిత వివిధ శాఖలు అధికారులు వారి వారి కార్యాలయంలో నుండి హాజరైనారు.

Leave a Reply