tributes | రాజీవ్‌గాంధీకి సీఎం రేవంత్ నివాళులు

tributes | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సచివాలయం సమీపంలో ఆయన విగ్రహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడు రాజీవ్‌గాంధీ అని కొనియాడారు. సాంకేతిక విప్లవాన్ని దేశానికి పరిచయం చేసిన దార్శనికుడు ఆయనేనని పేర్కొన్నారు. ఐటీ, కంప్యూటర్, టెలికాం రంగాల అభివృద్ధికి రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణయాలు దేశ భవిష్యత్తును మార్చాయని అన్నారు.
స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కుతుందని సీఎం తెలిపారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సోనియా గాంధీ కృషి చేశారని చెప్పారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, తెలంగాణ సమాజం సోనియా గాంధీ కుటుంబానికి రుణపడి ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
