gold price| బెంబేలెత్తిస్తున్న బంగారం ధ‌ర‌లు

ఇవాళ పెరిగిన గోల్డ్‌, సిల్వ‌ర్ రేట్స్‌
24 క్యారెట్ల తులం ధ‌ర – రూ.1,59,930
(రూ.490 పెరిగింది)
22 క్యారెట్ల తులం ధ‌ర – రూ.1,46,600
(రూ.450 పెరిగింది)
18 క్యారెట్ల తులం ధర – రూ.1,19,950
(రూ.370 పెరిగింది)

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం, వెండి ధ‌ర‌లు సామాన్యుల‌కు ఊహ‌కంద‌ని రీతిలో పెరుగుతున్నాయి. రెండు రోజులు త‌గ్గితే.. మ‌రో నాలుగు రోజులు పెరుగుతూ కొనుగోలుదారుల‌కు షాకిస్తున్నాయి. ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు త‌గ్గుతాయో తెలియ‌డం లేదు.
పశ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధ వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు పసిడి ధరలపై ప్ర‌భావం చూపుతున్నాయి. దేశీయ మార్కెట్లో గత మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూ రావడం విశేషం. అంతర్జాతీయ ఆందోళనకర పరిస్థితుల మధ్య సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి కనపడటం లేదు. బంగారం ధరలు రోజు రోజుకు అధికమవుతున్నాయి.

ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.3,500 పెరిగింది. వెండి రేటు మాత్రం బుధవారం భారీగా తగ్గగా.. ఇవాళ మళ్లీ పెరిగింది.

హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పెరిగి రూ.1,59,930 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,46,600 పలుకుతోంది. అదేవిధంగా 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరిగి రూ.1,19,950గా న‌మోదైంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్దకు చేరింది. కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది.

Leave a Reply