21stMay 2026 | తిరుమల సమాచారం..

21stMay 2026 | తిరుమల సమాచారం..

21stMay 2026 | తిరుమల, ఆంధ్రప్రభ :

ఓం నమో వెంకటేశాయ..

“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,

ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”

అర్థం:

కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే

గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మే 20న మొత్తం 86,315 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 44,107 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ కానుకల ద్వారా రూ.3.94 కోట్ల ఆదాయం లభించింది.

సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు గోగర్భం డ్యామ్ సర్కిల్ సమీపంలోని ఆక్టోపస్ భవనం వెలుపల వరకు వేచి ఉండే పరిస్థితి నెలకొంది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు దర్శనానికి సుమారు 24 నుంచి 30 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.

Leave a Reply