వడదెబ్బతో వృద్ధుడు మృతి

వడదెబ్బతో వృద్ధుడు మృతి

కేసముద్రం ,(ఆంధ్రప్రభ): వంద రోజుల పనికి వెళ్లిన అర్పణపల్లి గ్రామానికి చెందిన నేరళ్ల సోమయ్య మండుతున్న ఎండలకు తాళలేక వడదెబ్బకు గురై మృతి చెందాడు. మృతుని వయసు 75 సంవత్సరాలు. వివరాల్లోకి వెళ్తే వంద రోజుల పనిలో భాగంగా పనులకు వెళ్లిన సోమయ్య గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండ వేడిమికి గురయ్యాడు. ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ఉపేంద్ర ఉన్నారు.
సోమయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మండుటెండల నేపథ్యంలో వంద రోజుల కూలీలు, వృద్ధులు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply