మంచు మనోజ్ దంపతుల గొప్పనిర్ణయం!

మంచు మనోజ్ దంపతుల గొప్పనిర్ణయం!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ మే 20న తన పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు ఒక కొత్త ట్రస్ట్‌ను ప్రారంభించారు. ఈ సంస్థకు ‘ఐక్య ధైర్య సేన సమితి’ (AIKYA) అని పేరు పెట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ నాయకులు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ పేరును అనౌన్స్ చేశారు.
ఈ సందర్బంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఈ ట్రస్ట్ ఏర్పాటు వెనుక తన భార్య భూమా మౌనిక ఆలోచన ఉందని , ఆమె స్ఫూర్తితోనే దీనిని స్థాపించానని తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా తొలి విడతగా 5గురు నిరుపేద పిల్లలను దత్తత తీసుకుని, వారి చదువు, సంరక్షణ బాధ్యతలను పూర్తిగా చూసుకోనున్నట్లు ప్రకటించారు. చదువుతో పాటు రక్తదానం, వైద్య సహాయం వంటి మరికొన్ని సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఈ సంస్థ ద్వారా నిర్వహించనున్నారు.
