ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో2000-2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా కొనసాగింది. 26 ఏళ్లకు ఒకే వేదికపై పూర్వ విద్యార్థులు కలుసుకొని ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ అలనాటి తీపి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. పాఠశాల ఆవరణలో తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఆశీర్వాదాలు పొందారు.

ఒకే తరగతి గదిలో చదువుకున్న వారంతా ఉద్యోగం, వ్యాపారం తదితర రంగాల్లో స్థిరపడ్డ వారంతా కలుసుకొని యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్నేహానికి గుర్తుగా వారు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎం రాజేష్. సి దానప్ప, భాస్కర్, సత్యనారాయణ, చంద్రశేఖర్, జి గోవర్ధన్ రెడ్డి, తిరుపతయ్య, తిరుపతి, రాము, వెంకట్రాంరెడ్డి, మక్బుల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply