సమగ్ర ఓటరు సవరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

సమగ్ర ఓటరు సవరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
- టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి పిలుపు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి కోరారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో ప్రత్యేక సమగ్ర సవరణపై ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రజల్లో ఉన్న అపోహలను విడిచిపెట్టాలని సూచించారు. ఈ ప్రక్రియ వల్ల ఎవరి ఓటు హక్కు కోల్పోదని స్పష్టం చేశారు. రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగిన వారికి ఒకే చోట ఓటు హక్కు కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్లలో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు షఫీ హఫీజ్, కాంగ్రెస్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్లు నవాజ్, సోహైల్, బబ్బు, సంగారెడ్డి తహసీల్దార్ జైరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
