10grams | భారీగా పెరిగిన బంగారం ధరలు

10grams | భారీగా పెరిగిన బంగారం ధరలు
10grams | దిగుమతి సుంకాన్ని పెంచిన కేంద్రం
6 శాతం నుండి 15 శాతానికి పెంపు
దీంతో తులంపై రూ.14 వేల వరకు హైక్
24 క్యారెట్ల గోల్డ్ తులం – 1,67,890
(రూ.13,910 పెరిగింది)
22 క్యారెట్ల గోల్డ్ తులం – రూ.1,53,900
(రూ.12,750 పెరిగింది)
18 క్యారెట్ల గోల్డ్ తులం – రూ.1,25,920
(రూ.10,430 పెరిగింది)
10grams | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చి విషయం తెలిసిందే. ఆయన ఈ మాట అన్న రెండు రోజులకే బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. అమాంతం పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలను చూసి కొనుగోలుదారులు కళ్లు తేలేస్తున్నారు. అసలే వివాహ శుభకార్యాలు జరుగుతున్న వేళ బంగారం కొనడం తప్పనిసరి. ఇలాంటి సమయంకలో రేట్లు ఒక్కసారిగా జంప్ కావడంతో కంగారెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచడంతో బంగారం భారంగా మారింది. బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి 15 శాతానికి పెంచడంతో బంగారం మరింత ప్రియంగా మారింది.
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ తగిలింది.. ఇవాళ ఏకంగా తులం బంగారం ధర సుమారు రూ.14 వేల వరకు పెరగడంతో బంగారం కొనాలనుకునే వారు షాక్కు గురయ్యారు. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర ఇలా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఏకంగా రూ.13,910 పెరగగా.. రూ.1,67,890కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.12,750 పెరగగా, ప్రస్తుతం రూ.1,53,900గా ఉంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,430 మేర పెరిగింది.. ఇప్పుడు తులం ధర రూ.1,25,920కి పెరిగింది.. ఇదే సమయంలో వెండి ధర స్వల్పంగా పెరిగింది.. కిలో వెండి ధర రూ.100 పెరగడంతో రూ.3,00,100కు చేరుకుంది.
CLICK HERE TO READ stockmarket | సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్.. నిఫ్టీ బలహీనం
