సీసీటీవీలు, మాదకద్రవ్యాల నిరోధం పై అవగాహన సదస్సు

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి మండల పరిధిలోని ఇనాత్ నగర్‌లో సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత మరియు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థా లపై ఆదివారం కమ్మర్‌పల్లి ఎస్సై జి. అనిల్ రెడ్డి భారీ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని,ఇవి పోలీసులకు “మూడవ కన్ను” లాంటివని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టవచ్చని సూచించారు.అనంతరం మాదకద్రవ్యాల రహిత సమాజం గురించి మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.

గ్రామంలో ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా,సేవించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.సమాజ రక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో ఇనాయత్ నగర్ గ్రామ ప్రముఖులు,యువకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply