24carat |బంగారం ధరలు తగ్గాయోచ్..

24carat |బంగారం ధరలు తగ్గాయోచ్..
గత రెండురోజులు పెరిగిన గోల్డ్
ఇవాళ స్వల్పంగా నేలచూపు
24 క్యారెట్ల తులం బంగారం – రూ.1,52,680
(రూ. 320 మేర తగ్గింది)
22 క్యారెట్ల 10 గ్రాములకు – రూ.1,39,950
(రూ.300 దిగివచ్చింది)
కిలో వెండి ధర రూ. 2,75,000
(ఎలాంటి మార్పు లేదు)
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధర మాత్రం పెరగ లేదు.. తగ్గలేదు. వరుసగా భారీగా పెరుగుతూ ఆందోళన కలిగించినా పసిడి రేట్లు ఇవాళ దిగిరావడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన క్రమంలో బంగారం ధరల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. మే 8వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 320 మేర తగ్గింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,52,680గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.300 దిగివచ్చింది. దీంతో 10 గ్రాములకు రూ.1,39,950కు చేరింది. 19 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.240 తగ్గింది. దీంతో 10 గ్రాములకు రూ.1,14,510కు చేరింది.
బంగారం ధరలు దిగివచ్చినప్పటికీ వెండి రేటు మాత్రం తగ్గలేదు. ఈరోజు దీని ధర స్థిరంగానే కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి ధర రూ. 2,75,000గా ఉంది.
