19 kilograms | వాణిజ్య సిలిండర్‌పై రూ.994 పెంపు

19 kilograms | వాణిజ్య సిలిండర్‌పై రూ.994 పెంపు

19 kilograms |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం భారత్‌లో గ్యాస్ ధరలపై తీవ్రంగా పడింది. హోటళ్లు, వ్యాపార అవసరాల కోసం వినియోగించే 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం ఒక్కసారిగా భారీగా పెంచింది. తెలంగాణలో ఒక్కో సిలిండర్‌పై రూ.994 పెరగడంతో కొత్త ధర రూ.3,315కు చేరింది.

ఈ భారీ పెంపుతో హోటల్ యజమానులు, చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ఖర్చులకు తోడు గ్యాస్ ధరలు కూడా పెరగడం వ్యాపారాలపై అదనపు భారం మోపుతోంది.

అయితే గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో సామాన్య గృహ వినియోగదారులకు తాత్కాలికంగా ఊరట లభించింది. ఇక ఐదు కిలోల చిన్న సిలిండర్ ధర కూడా పెరిగి రూ.914.50కు చేరింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతోనే ఈ ధరల పెంపు జరిగినట్లు తెలుస్తోంది.

Leave a Reply