పెట్రోల్ బంక్ లను తనిఖీ చేసిన తహసిల్దార్..

పెట్రోల్ బంక్ లను తనిఖీ చేసిన తహసిల్దార్..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ పట్టణంలోని పెట్రోల్ బంక్ లను ఆదివారం ఉరవకొండ తహసిల్దార్ భోగన్న గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పెట్రోల్ మరియు డీజిల్ విషయంలో మాధ్యమిక మీడియాలో వస్తున్న కథనాల్లో భాగంగా ఉరవకొండ మండలంలోని పెట్రోల్ బంక్ లను తనిఖీ చేపట్టినట్లు తహసిల్దార్ భోగన్న గౌడ్ తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్ బంక్ లో ఉన్న పెట్రోల్, డీజల్ స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ కొరత లేదని, తగినంత స్టాక్ ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ విషయంలో వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. పెట్రోల్,డీజల్ ఎక్కువ ధరలకు అమ్మకాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply