digital manner | ప్రధాని మోదీ పిలుపు

digital manner | ప్రధాని మోదీ పిలుపు
digital manner | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : జనగణన 2027లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన్‌కీ బాత్‌లో ఆయన ప్రజలకు సందేశమిచ్చారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, అందరి బాధ్యత అని మోదీ పేర్కొన్నారు. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. డేటా భద్రంగా, గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి ప్రజల కచ్చితమైన సమాచారం అందించాలన్నారు. స్వీయ గణన చేసుకున్న వారికి యునిక్ ఐడీ వస్తుందని, వెరిఫికేషన్ కోసం దానిని సిబ్బందికి చూపించొచ్చన్నారు. ఈసారి జనాభా గణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని, డేటా సేకరణ కోసం మొబైల్ యాప్‌లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రజలు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే సదుపాయం కల్పించారన్నారు.
