KTR | కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి
KTR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేటీఆర్ ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ సర్కారు హత్యేనని ఆరోపించారు.
కార్మికులకు ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని తట్టుకోలేకే శంకర్‌గౌడ్ బలవన్మరణం పొందాడని కేటీఆర్ అన్నారు. శంకర్‌గౌడ్ కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలోని పలుచోట్ల అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నర్సంపేట డిపో వద్ద శంకర్‌గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే శంకర్‌గౌడ్ కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు, పెండింగ్ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కేటీఆర్ స్పష్టం చేశారు. కార్మికుల హక్కులు సాధించే వరకు సంఘటితంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
