కేంద్రమంత్రి నితిన్ గడ్గరి, మనోహర్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం

కేంద్రమంత్రి నితిన్ గడ్గరి, మనోహర్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణంలో నేషనల్ హైవే – 65 పై ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ప్రయాణికులు, ప్రజల సౌకర్యార్థం అండర్ పాస్ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పనా ఐలయ్య యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు కైరంకొండ అశోక్ ల ఆధ్వర్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్గరి, పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మునుగోడు నియోజకవర్గం ఇన్చార్జి గంగిడి మనోహర్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. తాము చేసిన విజ్ఞప్తికి స్పందించిన జాతీయ రహదారుల అధికారులు శివశంకర్, సి ఎస్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండలానికి చెందిన బీజేపీ నాయకులు నేషనల్ హైవే అధికారులకు, కేంద్ర మంత్రి నితిన్ గడ్గరికి వినతి పత్రాలు అందజేయడం, ఆందోళనలు చేయడంతో అధికారులు స్పందించినట్లుగా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం చాలా కాలం పడుతుంది. దాన్లో తల దూర్చొద్దని చెప్పిన కాంగ్రెస్, బీఆర్ఎస్, వారి అనుబంధ పార్టీల నాయకులు నేడు మా వల్ల వచ్చిందని చెప్పుకోవడంలో నిజం లేదన్నారు. వలిగొండ నాగారం – చౌటుప్పల్ రోడ్డు పనులు గత రెండు సంవత్సరాల నుండి నత్తనడకన సాగి నేడు పూర్తిగా పని ఆపారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆ రోడ్డుపై దృష్టి పెట్టి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసిన శిలాఫలకం వద్ద రోడ్డుపై బైఠాయించి నల్ల జెండా పాతి నిరసన ర్యాలీ నిర్వహించారు.

కర్గే దిష్టిబొమ్మ దహనం..
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కర్గే గత కొంతకాలం నుండి నిరాశ నిస్పృహతో అనాలోచితంగా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉగ్రవాదిగా వర్ణించిన దానికి నిరసనగా బీజేపీ నాయకులు పట్టణంలో కర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశంలో శాంతిభద్రతలు క్షీణించే విధంగా ఒక వర్గం వారికి అనుకూలంగా మెజార్టీ ప్రజలను అవమాన పరుస్తూ మాట్లాడే కర్గే పై నాన్ బెలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైల్లో పెట్టాలని, వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, భారత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమాలలో బీజేపీ సీనియర్ నాయకులు దూడల బిక్షంగౌడ్, రమణగోని శంకర్, శాగ చంద్రశేఖర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఆలే చిరంజీవి, దిండు భాస్కర్, గుజ్జుల సురేందర్ రెడ్డి, 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్, రెడ్డిబావి సర్పంచ్ నందగిరి వెంకటేశం, కంది లక్ష్మారెడ్డి, ఊడుగు వెంకటేశం, పోలోజు శ్రీధర్ బాబు, ఉబ్బు బిక్షపతి, కడారి ఐలయ్య, గంట్ల బుచ్చిరెడ్డి, గుర్రం రవీందర్, తేలుకుంట్ల శ్రీధర్, రాధారపు సత్తయ్య, పోలపల్లి ముత్తయ్య, గోషిక నీరజ, హల్మాస్పేట గౌతమ్, గోషిక పురుషోత్తం, కంచర్ల వెంకట్ రెడ్డి, గుండెబోయిన వేణు, ఎల్లంకి పాండు, కాసోజు కనకాచారి, పోలోజు భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply