శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయం పనులు ప్రారంభం

శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయం పనులు ప్రారంభం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షులు కె సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయం నిర్మాణం పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షులు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేసుకున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు భగవంతుని సేవ చేసుకోవడం కోసం, దైవ సందర్శన, ప్రశాంత వాతావరణం కోసం అందుబాటులో దేవాలయం ఉండాలనే ఆలోచనతో నూతనంగా సమాఖ్య ఆధ్వర్యంలో దేవాలయంను నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలలో సమాఖ్య జాయింట్ సెక్రటరీ ఎం గోపాల్ రావు, వైస్ ప్రెసిడెంట్ జె ఆనంద్ రెడ్డి, ఫాప్సియా మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ హనుమంత్ రెడ్డి, పటాన్ చెరువు ఐడిఏ మాజీ చైర్మన్ కళా రమేష్, సేవా భారతి ట్రస్ట్ ప్రతినిధులు శ్రీధర్, అఖిల, దండు మల్కాపురం మాజీ ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు తదితరులతో పాటు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply