చివరి రోజు.. 16 దరఖాస్తులు దాఖలు

చివరి రోజు.. 16 దరఖాస్తులు దాఖలు

  • 27న అర్హుల జాబితా వెల్లడి

మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మున్సిపాలిటీలో 4 కో ఆప్షన్ స్థానాలకు గురువారం చివరి రోజు 16 దరఖాస్తులు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ కె. సతీష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక పరిజ్ఞానం, రాజకీయ అనుభవం కలిగిన కేటగిరీలో 11 మంది, మైనారిటీ కేటగిరీలో 5 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. నేటి నుండి 3 రోజుల్లో దరఖాస్తుల పరిశీలన జరిపిన అనంతరం అర్హుల జాబితాను ఈ నెల 27న ప్రకటిస్తామన్నారు. తదుపరి కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో తీర్మానం మేరకు కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ఉంటుందని, త్వరలోనే కౌన్సిల్ ప్రత్యేక సమావేశం తేదీని ప్రకటిస్తామని కమిషనర్ తెలిపారు.

Leave a Reply