కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కడెం, ఆంధ్రప్రభ : రైతులు తమ వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ సూచించారు.
మంగళవారం కడెం మండలంలోని కళ్లెడ, చిన్న బెల్లాల్ గ్రామాల్లో ఐకేపీ–పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.
రైతులు దళారులను నమ్మకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి లబ్ధి పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, డీసీసీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం జి. గంగాధర్, కడెం మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేష్ యాదవ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బరుపాటి రమేష్ వర్మ, గ్రామాల సర్పంచ్లు తాటి రుక్మిణి దేవి, సంజీవ్ పటేల్, బొంతల లక్ష్మీ భూమన్న, బొడ్డు స్పందన గంగన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రావు, తక్కల్ల సత్యనారాయణ, కొండాపురం లక్ష్మణ్, వాజిద్ ఖాన్, ఐకేపీ అకౌంటెంట్ లింగన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.
