తెలంగాణ జాగృతిలో చేరిన సబ్బని కృష్ణ..

తెలంగాణ జాగృతిలో చేరిన సబ్బని కృష్ణ..

కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సబ్బని కృష్ణ మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతిలో చేరారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే నూతన పార్టీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్టీ బలోపేతానికి సబ్బాని కృష్ణ వంటి నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. కాగా సబ్బని కృష్ణ గతంలో ఎంసీపీఐ(యు) పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.

రెండేళ్ల క్రితం బెల్లంపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ చేరిన విషయం విధితమే. ప్రస్తుతం తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరడంతో పట్టణ రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతూనే రాజకీయంగా రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

కల్వకుంట్ల కవిత నాయకత్వంపై నమ్మకంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే బెల్లంపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply