Jr Ntr | లైనప్ మామూలుగా లేదుగా..

Jr Ntr | లైనప్ మామూలుగా లేదుగా..

Jr Ntr | ఎన్టీఆర్ ఎందుకు నో చెప్పాడు?
శౌర్యువ్ పవర్ ఫుల్ స్టోరీకి కొత్త హీరో
విజయ్ దేవరకొండతో మైథలాజికల్ డ్రామా ప్రారంభం
భారీ లైనప్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్

Jr Ntr | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇండస్ట్రీలో ఒకరి కోసం కథ రాస్తే.. మరో స్టార్ తో సెట్ అవ్వడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. నాటి నుంచి నేటి వరకు ఇలా చాలానే జరిగాయి. అయితే.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గత కొంతకాలంగా ట్రై చేసాడు కానీ.. వర్కవుట్ కాలేదు. ఇప్పుడు అదే కథను మరో స్టార్ కి చెబితే ఓకే అవ్వడం.. స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇంతకీ.. ఆ డైరెక్టర్ ఎవరు..? ఎన్టీఆర్ నో చెప్పడానికి కారణం ఏంటి..?

Jr Ntr

Jr Ntr | అందుకే.. నో చెప్పాడట ఎన్టీఆర్..

ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్న డైరెక్టర్ శౌర్యువ్. హాయ్ నాన్న సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శౌర్యువ్.. ఫస్ట్ మూవీతోనే ఎమోషన్స్ ను బాగా డీల్ చేయగలడు.. టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆతర్వాత శౌర్యువ్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ట్రై చేశాడు. ఆయన కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశాడు. ఎన్టీఆర్ కు కథ చెప్పడం జరిగిందట. అయితే.. ఎన్టీఆర్ కి నచ్చినప్పటికీ.. ఆయన ఇప్పుడు వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలి. దేవర 2 చేయాలి.. నెల్సన్ దిలీప్ కుమార్ తో చేయాలి.. ఇలా లిస్ట్ పెద్దదే ఉంది. అందుకనే.. బాగా ఆలస్యం అవుతుందనే ఉద్దేశ్యంతోనే కావచ్చు.. నో చెప్పారట.

Jr Ntr

Jr Ntr | విజయ్, శౌర్యువ్ మైథలాజికల్ డ్రామా..

ఈ వార్త బయటకు వచ్చినప్పుడు శౌర్యువ్ అలాంటిది ఏమీ లేదు.. ఎన్టీఆర్ తో సినిమా చేయాలనివుంది కానీ.. అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే.. ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం.. ఎన్టీఆర్ తో శౌర్యువ్ కథ చెప్పడం.. సున్నితంగా నో చెప్పడం కూడా జరిగిందట. అయితే.. ఆ కథను విజయ్ దేవరకొండకు చెబితే.. కథ నచ్చి ఓకే చెప్పాడట. ఈ సినిమాను ప్రారంభించారు. ముహుర్తపు సన్నివేశానికి నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. ఇది మైథలాజికల్ డ్రామా అని సమాచారం. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ జ‌నార్థ‌న‌, ర‌ణ‌బాలి చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే శౌర్య‌వ్ మైథ‌లాజిక‌ల్ డ్రామా షూటింగ్ స్టార్ట్ చేస్తాడని సమాచారం. మరి.. శౌర్యువ్ ఈ సినిమాతో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

Jr Ntr

Leave a Reply