ఘనంగా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు .

ఘనంగా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు .
76 కేజీల భారీ కేక్ కట్ చేసిన రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్..
రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలతో సందడి..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 76 వ పుట్టినరోజు వేడుకలు నంద్యాల లో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించరు. ఈ సంబరాల్లో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, తులసి రెడ్డి, జిల్లెల్ల శ్రీరాములు, యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, డాక్టర్ బాబాన్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.
పార్టీ శ్రేణుల మధ్య 76 కేజీల భారీ కేక్ కట్ చేశారు. యువత, పార్టీ కార్యకర్తల ఉత్సాహం మధ్య రక్తదాన శిబిరాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బెడ్ ను పంపిణీ చేసి వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. పేదల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ హస్పటల్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మసీదులు, చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అపర చాణక్యుడు, విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 76వ వసంతంలోకి అడుగుపెట్టడం మనందరికీ గర్వకారణం అన్నారు .రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలోనూ, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలోనూ ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు.
ముస్లిం మైనార్టీల అభివృద్ధికి చంద్రబాబు ఎల్లప్పుడూ పెద్దపీట వేశారన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని . పార్టీ కార్యకర్తలే చంద్రబాబు కి కొండంత అండ అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
