TG | జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌లో చీలిక..

TG | జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌లో చీలిక..
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆ పార్టీలో తీవ్ర విభేదాలకు దారితీస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరడాన్ని హరీశ్ రావు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అద్దంకి దయాకర్ తెలిపారు. ఈ చేరిక బీఆర్ఎస్ పార్టీలో నిలువు చీలికకు దారితీసేలా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
హరీశ్ రావు ఇటీవల బీజేపీ నాయకులతో కలిసి రహస్యంగా ఢిల్లీ వెళ్లినట్లు తమకు అనుమానం ఉందని దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందనే ఉద్దేశంతోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.
