చిట్యాల ఆణిముత్యం కలెక్టర్ నరసింహారెడ్డి

చిట్యాల ఆణిముత్యం కలెక్టర్ నరసింహారెడ్డి

  • చైర్ పర్సన్ పందిరి గీత

చిట్యాల, ఆంధ్రప్రభ : స్వయంకృషి, పట్టుదలతో కష్టాలను అధిగమించి ఐఏఎస్ హోదా సాధించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్ట‌ర్ ఏనుగు నరసింహారెడ్డి నేటి తరానికి ఆదర్శమని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత కొనియాడారు. ఆదివారం చిట్యాల మండల కేంద్రంలోని ముప్ప మల్లారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ప్రమోద సాహితీ, మిత్రబృందం ఆధ్వర్యంలో నరసింహారెడ్డికి ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్ పర్సన్ పందిరి గీత హాజరై మాట్లాడుతూ క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించడం చిట్యాల ప్రాంతానికి గర్వకారణమన్నారు. ప్రముఖ కవి నాలేశ్వరం శంకరం మాట్లాడుతూ, నరసింహారెడ్డి అధికారిగానూ, కవిగానూ రాణించడం విశేషమన్నారు. డాక్ట‌ర్ తండు కృష్ణ కౌండిన్య ఈ సన్మానం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ​సన్మాన గ్రహీత డాక్ట‌ర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషపై మక్కువతో ఆ భాషలోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నాను.

నన్ను తీర్చిదిద్దిన చిట్యాలకు ఎప్పటికీ కృతజ్ఞుడను అని అన్నారు. పట్టుదలతో కృషి చేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు అని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి కుక్కుడాల లక్ష్మణ్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, ప్రమోధ సాహితీ ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం,సృజన సాహితీ అధ్యక్షులు పెరుమాళ్ళ ఆనంద్, ఏభూషి నరసింహ, డా. సాగర్ల సత్తయ్య, సిలివేరు నరసింహ, నరసింహారెడ్డి మిత్ర బృందం కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply