ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి…..

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మండలం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్పూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆరుగురు బాలురు ఈతకు వెళ్లగా, అందులో ఇద్దరు గుంతలో పడి మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం, డబిల్పూర్లోని ఇస్కాన్ ఆలయం సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకాల వల్ల లోతైన గుంత ఏర్పడింది.
ఆదివారం ఈత కొట్టేందుకు వెళ్లిన ఆరుగురు బాలురలో ఉమన్ (14), అసలమ్ (12) గుంతలో మునిగిపోయారు. మిగతా బాలురు వెంటనే రోడ్డుపైకి వచ్చి ఆర్తనాదాలు చేయడంతో అటుగా వెళ్తున్న యువకులు స్పందించి వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరేసరికి ఇద్దరు బాలురు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
