మే డేని యుద్ధ బారాలకు వ్యతిరేకం దినంగా నిర్వహించాలి

మే డేని యుద్ధ బారాలకు వ్యతిరేకం దినంగా నిర్వహించాలి

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ప్రపంచ కార్మిక వర్గం తమ హక్కుల కోసం రక్తం చిందించిన మేడే 1న దురాక్రమణ యుద్ధ బారాలకు వ్యతిరేకంగా ఘనంగా నిర్వహించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి అన్నారు. ఆదివారం పట్టణంలో మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో టీయుసీఐ ఏరియా కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథి గా కొత్తపల్లి రవి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ తో కార్మిక వర్గం హక్కులు పూర్తిగా కోల్పోతుందన్నారు.

140 సంవత్సరాల క్రితం చికాగో మహానగరంలో కార్మికత్వం తమ రక్తాన్ని చిందించి సాధించిన ఎనిమిది గంటల పనిని నేడు బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసం12 గoటలకు పెంచడం జరిగిందని, ప్రమాదకరమైన పరిశ్రమలో మహిళలు సైతం అర్ధరాత్రి పని చేయాలని నిబంధన అనాగరికమైనచర్య అన్నారు. నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు మేడే సందర్భంగా ప్రతినబునాలని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్న దురాక్రమణ యుద్ధాలతో కార్మిక వర్గం ప్రజల పై పెను భారాలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీస వేతనాల గెజిట్ ముద్రించి అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. 60 లక్షల మంది కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీయూసీఐ ఏరియా నాయకులు వడ్లకొండ లక్ష్మయ్య, బైరి శ్రీనివాస్, వెంకటరమణ, ధర్మయ్య అరవపల్లి వెంకన్న, పాడియా, బీకు, గణేష్, జగన్ ,యాకయ్య తదితరులు పాల్గొన్నారు….

Leave a Reply