సీఎం జన్మదినోత్సవం సందర్భంగా…

సీఎం జన్మదినోత్సవం సందర్భంగా…
రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం…
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20న సోమవారం ఇబ్రహీంపట్నంలో రక్తదాన శిబిరంతో పాటు, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని కార్యాలయంలో దీనికి సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, తెలుగుదేశం పార్టీ-మైలవరం నియోజకవర్గం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. రక్తదానం చేయండి – ప్రాణదాతలు కండి అంటూ పిలుపునిచ్చారు. ముత్తవరపు స్వర్ణ ఏసీ కన్వెన్షన్, రింగ్ సెంటర్, ఇబ్రహీంపట్నంలో ఉదయం 8:30 నుండి సాయంత్రం 4:00 వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయన్నారు.
సాధారణ వ్యాధులు, గుండె, క్యాన్సర్, చెవి, కంటి, దంత, ఎముకల పరీక్షలు, షుగర్, బీపీ, రక్త పరీక్షలు, ఉచిత వినికిడి పరీక్షలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేస్తామని అన్నారు. మైలవరం నియోజకవర్గంలోని సభ్యులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
