వనపర్తిలో ‘జనసమయం’ పక్షపత్రిక ఆవిష్కరణ

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి శనివారం తన చాంబర్లో ‘జనసమయం’ పక్షపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడబ్ల్యూ జేఎఫ్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్( Twjf)రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు అంబటి స్వామి, ప్రధాన కార్యదర్శి గంగవరం రామకృష్ణారెడ్డి,రవీందర్,బాలరాజులసమక్షంలో పత్రికను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎడిటర్లు యాదమ్మ, పృథ్వి కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ వనపర్తి బృందంతో కలిసి జిల్లా కలెక్టర్ ఆదర్శసురభిపత్రికను ప్రారంభించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఈ పక్షపత్రిక కీలక పాత్ర పోషిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply