రేషన్ బియ్యం…పట్టుపడుతున్న ఆగని అక్రమ రవాణా

రేషన్ బియ్యం…పట్టుపడుతున్న ఆగని అక్రమ రవాణా

  • అక్రమార్కులపై 6ఎ సెక్షన్‌ కేసులతో సరి
  • రేషన్ డీలర్ పై కేసు నమోదు
  • దొరికితే కేసులు.. లేకుంటే కాసులు

మద్దూర్, ఆంధ్రప్రభ : ప్రతీ పేదవాళ్లు సన్న బియ్యం అన్నం తినాలని ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. పేదలుదొడ్డు బియ్యాన్ని తినకుండా విక్రయిస్తుండటంతో వృథాను అరికట్టాలని సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుంది.ఎండాకాలం నేపథ్యంలో మూడు నెలలకు సరిపడా బియ్యం ఒకేసారి లబ్ధిదారులకు పంపి ణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు డీలర్లు అందజేస్తున్నారు. ఒకేసారి మూడు నెలల బియ్యం రావడంతో దళారులు లబ్ధిదారుల కు డబ్బుల ఆశ చూపి కొనుగోలు చేస్తున్నారు. ఇలా తీసుకోగానే దళారులు అలా వచ్చి తీసుకెళ్తున్నారు.

దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ప్రభుత్వాలు పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న పీడీఎస్‌ బియ్యం, వ్యాపారుల కు వరంగా మారింది.ఇంత జరుగుతున్నా సివిల్‌ సప్లయ్‌ అధికారులు సక్రమంగా దాడులు నిర్వహించకపోవడంతో అక్రమార్కులు తమ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.పోలీస్ అధికారులు అడపాదడపా దాడులు చేయడం, ఆపై వదిలేయడంతో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.కొంతమంది రేషన్ డీలర్ లు రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తునట్లు ప్రజలు నుంచి ఆరోపణలు వస్తున్న సివిల్‌ సప్లయ్‌ అధికారులు మాత్రం రేషన్ డీలర్ ల దుకాణాలు తనిఖీ చేయడం లేదంటున్నారు.

దొరికితే కేసులు.. లేకుంటే కాసులు

కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామం శివారులో నర్సింలు( ఆటో),శబ్బర్(ద్విచక్రవాహనం) అక్రమంగా తరలిస్తున 4.20 క్వింటల్ రేషన్ బియ్యం పోలీసులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు.పెద్దాపూర్ గ్రామానకి రేషన్ డీలర్ భర్త కృష్ణయ్య,ఆటో డ్రైవర్ సాయిలు 16 గాన్ని బ్యాగ్ (8క్వింటల్) పిడిఎస్ బియ్యం పోలీస్ పట్టుకోవడం జరిగింది.అక్రమంగా పిడిఎస్ బియ్యం రవాణా చేస్తున్న కృష్ణయ్య, సాయిలు, రేషన్ డీలర్ మంగమ్మ, నర్సిములు, శబ్బర్ లపై 6 ఎ కేసులు నమోదు చేసినట్లు సివిల్‌ సప్లయ్‌ అధికారి ఆనందు తెలిపారు.

Leave a Reply