17thaprileditorial | మహిళలకు సామాజిక భద్రత ఎందుకు అత్యవసరం?

17thaprileditorial | మహిళలకు సామాజిక భద్రత ఎందుకు అత్యవసరం?
17thaprileditorial | మహిళల రిజర్వేషన్లపై రాజకీయ చర్చ
సమాజ దృక్పథంలో మార్పు అవసరం
మహిళల సాధనలు మరియు ఆత్మస్థైర్యం
కుటుంబం నుంచి ప్రారంభమయ్యే సమానత్వం
ఉద్యోగాల్లో మహిళల రాణింపు
భద్రత, గౌరవం – అసలు అవసరం
సమాన వేతనాలు, చట్టాల ప్రాముఖ్యత
17thaprileditorial | మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల గురించి పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చర్చ జరుగుతోంది. అన్ని పార్టీలూ మహిళల రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని స్వరాలు పెంచి ప్రకటిస్తున్నాయి. ఇది పేచీ లేని అంశం కనుక, వారి కోరస్‌లో నిజాయితీ ఉందని అంగీకరిద్దాం. మహిళలకు ఇప్పుడు కావాల్సింది సామాజిక భద్రత. మహిళల పట్ల సమాజ దృక్పథంలో మార్పు రావాలి. మాటల్లో, చేతల్లో, వాచికాభినయంలో మార్పు అవసరం. మహిళలు తమ హక్కుల కోసం పోరాడి ఇప్పటికే చాలా సాధించారు. ఇంకా సాధిస్తారనే నమ్మకం సమాజానికి కలిగిస్తున్నారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల వారిలో స్వతంత్ర భావం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అందుకే మహిళా సంఘాలు దశాబ్దాలుగా ఈ డిమాండ్ చేస్తున్నాయి. మన వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపే ధైర్యం మహిళల్లో ఉంది. సమాజానికి పునాది అయిన కుటుంబంలోనే కొన్నిసార్లు మహిళల పట్ల వివక్ష కనిపిస్తోంది. తండ్రి సంపాదనపై అవగాహన ఉండటంతో ఆడపిల్లలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. మహిళలను “ఆకాశంలో సగభాగం” అని పొగిడినా, వారికి తగిన గౌరవం, స్థానం ఇవ్వడంలో లోటు ఉందన్నది నిజం.
ఆధునిక సమాజంలో మహిళలు చైతన్యవంతులై తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వారిలో నిజాయితీ, పట్టుదల ఉన్నాయి. ఏ పని చేపట్టినా పూర్తయ్యే వరకు కట్టుదిట్టంగా పనిచేసే ఓర్పు, నేర్పు వారికి ఉన్నాయి. అందుకే ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వారు బాగా రాణిస్తున్నారు. “ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుంది” అన్న ఆర్యోక్తి ప్రసిద్ధి. మహిళలను ఆకాశానికి ఎత్తనవసరం లేదు; వారికి ఇవ్వాల్సిన గౌరవం, ప్రతిపత్తి ఇస్తే చాలు.

మన జాతిపిత చెప్పినట్లుగా — అర్థరాత్రి సమయంలో కూడా మహిళలు ధైర్యంగా, సురక్షితంగా ఇంటికి చేరగలిగితేనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టుగా భావించాలి. ఆయన ఏనాడో చెప్పిన ఈ మాటలు ఇప్పటికీ సార్థకమే. మహిళలకు పని ప్రదేశాల్లో వేధింపులు లేకుండా రక్షణ కల్పించడం అత్యవసరం. అలాగే వ్యవసాయం, అసంఘటిత రంగాల్లో మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు కల్పించాలి. ప్రైవేట్ రంగంలో కూడా ఇందుకు తగిన చట్టాలు తీసుకురావాలి. ప్రస్తుతం మహిళలకు అత్యవసరం సామాజిక భద్రత. అది కల్పిస్తే వారు ఎంచుకున్న రంగాల్లో మరింతగా రాణించి, తమ ప్రతిభను ప్రదర్శించగలరు.
