Delimitation | ఆ బిల్లుపై మజ్లిస్ పార్టీ అభ్యంతరం

Delimitation | ఆ బిల్లుపై మజ్లిస్ పార్టీ అభ్యంతరం

Delimitation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై మజ్లిస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులపై వివిధ రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును మజ్లిస్ పార్టీ వ్యతిరేకించింది.

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో మాట్లాడుతూ.. ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాహిర్ లుధియాన్వి రాసిన కవితను సభలో చదివి వినిపించారు. మహిళా రిజర్వేషన్ పేరుతో ముస్లిం ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

అలాగే డీలిమిటేషన్ బిల్లుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు ప్రజాస్వామ్య, సమాఖ్య వ్యవస్థలకు విరుద్ధమని పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గించేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే వంటి పలు ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.

Leave a Reply