జాతీయ రహదారిపై బీజేపీ రాస్తారోకో

జాతీయ రహదారిపై బీజేపీ రాస్తారోకో

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ప్రయాణికులు, ప్రజల సౌకర్యార్థం అండర్ పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన, ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఒక వర్గానికి చెందిన అక్రమ దర్గాకు పరిహారం కూడా తీసుకున్నప్పటికీ దాన్ని కూల్చివేయకుండా కాపాడడం కోసం పాత కొలతల ప్రకారం కాకుండా ప్లైఓర్ బ్రిడ్జి నిర్మాణంలో మార్పు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఒక వర్గం మెప్పుకోసం రాజకీయ కోణంలో ఆలోచించి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొలతలలో మార్పులు చేయడం వల్ల నియోజకవర్గం కేంద్రం కానున్న చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అండర్ పాస్ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని, రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సర్వీస్ రోడ్ లో ఉన్న అక్రమ దర్గాను తొలగించి పాత కొలతల ప్రకారమే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.

మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రమణ గొని శంకర్, శాగ చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, గుజ్జల సురేందర్ రెడ్డి, ఊడుగు వెంకటేశం, 2వ వార్డ్ కౌన్సిలర్ పోలపల్లి లక్ష్మి:ముత్తయ్య, 6వ వార్డు కౌన్సిలర్ ఆలే శ్రీలత చిరంజీవి, 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డా సురేష్, దిండు భాస్కర్ సీనియర్ నాయకులు అమృతం దశరథ, గుర్రం రవీందర్, గుండెబోయిన వేణు, బత్తుల జనార్ధన్, ఊదరి రంగయ్య, వరగంటి భాను, గోశిక పురుషోత్తం, పబ్బతి శేఖర్, ఉష్కాగుల నాగరాజు, కానుగు కొండల్, జి వెంకట్ రెడ్డి, బి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply