భారీగా పెరిగిన బంగారం, వెండి!

భారీగా పెరిగిన బంగారం, వెండి!
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయి దిశగా దూసుకెళ్తున్నాయి. నిన్న తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు, ఈరోజు (ఏప్రిల్ 14, 2026) హైదరాబాద్ బులియన్ మార్కెట్లో భారీగా పెరిగాయి.24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,470 పెరిగి, ప్రస్తుతం రూ. 1,53,930 వద్ద కొనసాగుతోంది.22 క్యారెట్ల బంగారం ఆభరణాల తయారీకి వాడే 10 గ్రాముల బంగారం ధర రూ. 1,350 పెరిగి రూ. 1,41,100 కు చేరింది. వెండి బంగారం దారిలోనే వెండి కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 5,000 పెరిగి రూ. 2,65,000 వద్ద పలుకుతోంది. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్ విలువలో మార్పుల కారణంగానే ధరలు ఈ స్థాయిలో పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
