ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలి

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలి
ఎమ్మెల్యే కూన రవికుమార్
పొందూరు(ఆమదాలవలస), ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ఆధునిక వసతులను ప్రజల్లోకి తీసుకెళ్లి, అడ్మిషన్ల శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పొందూరు పట్టణంలోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో అడ్మిషన్ల పెంపు, నూతన విద్యా విధానంపై నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీలో ఆయన స్వయంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,.. ప్రభుత్వ బడుల్లో ప్రైవేటుకు దీటుగా ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్యాబోధన, అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
