ఫెయిల్ అయిన మనస్థాపంతో సౌజన్య ఆత్మహత్య

ఫెయిల్ అయిన మనస్థాపంతో సౌజన్య ఆత్మహత్య
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దంతన్ పెల్లి గ్రామానికి చెందిన జిల్ల పెల్లి సౌజన్య (17) ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని ఆదివారం విడుదలైన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయిన మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో తన ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె బంధువులు తెలిపారు. ఆమె ఉట్నూర్ లోని శ్రీ పూలాజి బాబా జూనియర్ కాలేజీలో చదువుకుంటుందని తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయినందుకు మనస్థాపానికి గురై ఆత్మహత్య బంధువులు తెలిపారు. జరిగిన సంఘటనపై ఉట్నూర్ ఎస్సై విజయ్ కుమార్ ను అడుగగా జిల్లా పెల్లి సౌజన్య ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకు మనస్థాపానికి గెలిచింది ఆత్మహత్య చేసుకుందని మృతురాలు తల్లి బుచ్చవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉట్నూర్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.
